schedule Thursday, September 03, 2026

కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి

calendar_today August 23, 2026
person dharshininews
కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి
కమీషన్ల వల్లే కాగ్నాకు దుస్థితి - గత ప్రభుత్వంలో నాణ్యతపై శ్రద్ద కరువు - కాగ్నా వంతెనకు మరమ్మత్తులు, భద్రతపై దృష్టి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గత ప్రభుత్వ హాయాంలో పాలకులు కమీషన్లను ఆశించడం వల్ల కాగ్నానది వంతెనకు దుస్థితి వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విమర్శించారు. తాండూరు, కోడంగల్ రోడ్డు మార్గంలోని కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏర్పడిన పగుళ్లను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల నాణ్యతపై సరైన శ్రద్ధ చూపకుండా, కమిషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటూ ఆరోపించారు. కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఒకే ఏడాదిలో రెండుసార్లు పగుళ్లు ఏర్పడటం ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాగ్నా వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వంతెన భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, కౌన్సిలర్లు, నేతలు ఉన్నారు. https://www.dharshininews.com/44331/