schedule Thursday, September 03, 2026

ఏకగ్రీవంగా టీపీఆర్‌ఎస్‌ఏ ఎన్నిక

calendar_today August 19, 2026
person dharshininews
ఏకగ్రీవంగా టీపీఆర్‌ఎస్‌ఏ ఎన్నిక
ఏకగ్రీవంగా తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షులుగా గంజిపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్దన్ రెడ్డి - నూతన కార్యవర్గానికి సన్మానం, పలువురి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ 2026-2028 నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ (ఐరా స్కూల్), అధ్యక్షులుగా గంజిపల్లి ప్రశాంత్ కుమార్, ( కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్), ఉపాధ్యక్షులుగా కల్పన (నాగార్జున స్కూల్), గూళి శివకుమార్ ( శివం స్కూల్), ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్దన్ రెడ్డి ( శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్), సహకార్యదర్శులుగా విష్ణువర్ధన్ రెడ్డి (స్మార్ట్ కిడ్స్), కవిత ( అబ్యాస్ స్కూల్), కోశాధికారిగా అబ్దుల్ సలీం(అయేషా మోడల్ స్కూల్), పెద్దేముల్ మండల ఇన్చార్జిగా కరుణాకర్ రెడ్డి( వివేకానంద స్కూల్), బషీరాబాద్ మండల ఇన్చార్జిగా రాజశేఖర్ (బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్), లీగల్ అడ్వైజర్ గా జిలాని (ప్రగతి స్కూల్), ముఖ్య సలహాదారులుగా గోపీచంద్ ( కెపిహెచ్ఎస్), ఇస్మాయిల్(మోయిన్ కాన్వెంట్), అగ్గనూరు కిరణ్ కుమార్ (శివసాగర్ స్కూల్) జసింత (సెయింట్ మేరీ స్కూల్) ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బడ్జెట్ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు ఇచ్చిన ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించి.. పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 39 పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44271/