schedule Thursday, September 03, 2026

మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి

calendar_today August 14, 2026
person dharshininews
మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి
మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయండి - ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - నూతన పాలకవర్గానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి అభివృద్ధికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా ఖాసిం అలీ, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటి ద్వారా పాలకవర్గం రైతులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. రైతులకు, వ్యాపారులకు అందుబాటులో ఉండి మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, యువ నాయకులు రొంపల్లి సంతోష్‌ కుమార్, ఎబినేజర్, కల్వ వంశి, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44208/