schedule Thursday, September 03, 2026

తాళం వేసిన ఇళ్లలో చోరీ..

calendar_today August 14, 2026
person dharshininews
తాళం వేసిన ఇళ్లలో చోరీ..
తాళం వేసిన ఇళ్లలో చోరీ.. - ఒకే రాత్రి మూడు ఇళ్లకు కన్నం - రూ.46 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలు అపహరణ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలోకి చొరబడిన దుండగులు నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామస్థుల్లో కలకలం రేపింది. గ్రామానికి చెందిన బాధితులు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లిన సమయంలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించిన దుండగులు బీరువాలు, సామగ్రిని చిందరవందర చేసి విలువైన వస్తువుల కోసం గాలించారు. ఓ ఇంట్లో రూ.15 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. మరో ఇంట్లో బీరువాను ధ్వంసం చేసిన దొంగలు సుమారు రూ.30 వేల నగదు తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తం మూడు ఇళ్లలో కలిపి సుమారు రూ.46 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ఇళ్ల నుంచి ఆధారాలను సేకరించేందుకు క్లూస్‌ టీంను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. https://www.dharshininews.com/44190/