schedule Thursday, September 03, 2026

తాండూరు అభివృద్దికి మెరుగైన సేవలందించండి..!

calendar_today August 7, 2026
person dharshininews
తాండూరు అభివృద్దికి మెరుగైన సేవలందించండి..!
తాండూరు అభివృద్దికి మెరుగైన సేవలందించండి..! - ఆర్అండ్ బీ డీఈగా పదోన్నతి పొందిన శ్రావణ్ కుమార్‌కు సన్మానం - శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అభివృద్ధికి మెరుగైన సేవలు అందించాలని ఆర్అండ్ బీ డీఈ శ్రావణ్ కుమార్ ను స్థానిక కాంగ్రెస్ నేతలు కోరారు. రోడ్లు & భవనాల శాఖలో ఏఈ గా విధులు నిర్వహించి ఇటీవల డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా పదోన్నతి పొందిన శ్రవణ్ కుమార్‌ను తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం తాండూరు పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ఆయనతో చర్చించారు. డీఈగా పదోన్నతి పొందిన అనంతరం తాండూరు ప్రాంతానికి మరింత మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఇందుకు శ్రావణ్ కుమార్ సానుకూలంగా స్పందించి ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. https://www.dharshininews.com/44078/