schedule Thursday, September 03, 2026

తాండూరు అభివృద్ధికి కేరాఫ్‌గా బీఎంఆర్‌

calendar_today August 5, 2026
person dharshininews
తాండూరు అభివృద్ధికి కేరాఫ్‌గా బీఎంఆర్‌
తాండూరు అభివృద్ధికి కేరాఫ్‌గా బీఎంఆర్‌ - రూ.1,500 కోట్ల పైగా నిధులతో నియోజకవర్గానికి కొత్తరూపు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో ప్రగతి బాట - కాంగ్రెస్ ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గం అభివృద్ధి పరంగా కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. సాగునీటి రంగంలో చిలుకవాగు, కోట్‌పల్లి ప్రాజెక్టులు, జంటుపల్లి కాలువల నిర్మాణం పురోగతిలో ఉండగా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో గ్రామీణ, ప్రధాన రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ఎస్‌డీఎఫ్, డీఎంఎఫ్‌టీ నిధులతో గ్రామాలు, మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేలా 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పాఠశాలల అభివృద్ధి, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులు పూర్తవుతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏటీసీ సెంటర్, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు, వాటర్ ట్యాంకులు, అవుట్‌ఫాల్ డ్రైన్, తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు తాండూరు అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా బైపాస్ రోడ్డు భూసేకరణకు నిధుల మంజూరు, భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన నష్టపరిహారం, హిందూ ఉత్సవ సమితి, ముదిరాజ్, కురుమ భవనాల నిర్మాణాలకు భూముల కేటాయింపు, ప్రత్యేక నిధుల విడుదల వంటి నిర్ణయాలు ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని చాటుతున్నాయని కరణం పురుషోత్తం రావు తెలిపారు. తాండూరు అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, "ప్రతి గ్రామం అభివృద్ధి – ప్రతి కుటుంబం సంక్షేమం" అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులతో తాండూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాండూర్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న ప్రధాన అభివృద్ధి పనులు:- 1. రూ.46 కోట్లతో చిలుకవాగు నిర్మాణ పనులు. 2. రూ.89.6 కోట్లతో కోట్‌పల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు. 5.71 కోట్లతో జంటుపల్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణ పనులు 3. రూ.1.50 కోట్లతో తాండూర్ మున్సిపల్ పరిధిలో ఐ & డీ గెస్ట్ హౌస్ మరమ్మతు పనులు. 4. రూ.4.8 కోట్లతో గొల్ల చెరువు కాలువ నిర్మాణ పనులు. 5. రూ. 189.52 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాలను పట్టణంతో అనుసంధానం చేసే రహదారుల నిర్మాణం. 6. రూ. 628.53 కోట్లతో ఆర్ & బీ శాఖ ద్వారా నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు. 7. రూ. 21.44 కోట్లతో ఎస్‌డీఎఫ్ (SDF) నిధుల ద్వారా తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో, తాండూరు మున్సిపల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. 8. రూ. 23.10 కోట్లతో డీఎంఎఫ్‌టీ (DMFT) నిధుల ద్వారా తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో, తాండూరు మున్సిపల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. 9. 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం. 10. రూ. 83.14 కోట్లతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా గ్రామాల్లో CC రోడ్లు, డ్రెయిన్లు, SHG భవనాలు, స్కూల్ కాంపౌండ్ వాల్స్, గ్రామపంచాయతీ భవనాలు, మొదలైన మౌలిక వసతుల అభివృద్ధి. 11. తాండూరు లో దాదాపు 45 కోట్లతో ATC సెంటర్ నిర్మాణం తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం 12. 19.27 కోట్లతో నూతనంగా ఆరు (6) ఎలెక్ట్రిక్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు 13. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం 14. 2 కోట్లతో వినాయక కన్వెన్షన్ నుండి రైల్వే బ్రిడ్జి వరకు ఔట్ఫాల్ సట్లెజ్ డ్రైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నవి. 15. 27.50 కోట్లతో NTR కాలనీ, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, & రాజీవ్ కాలనీ లలో వాటర్ ట్యాంక్ ల నిర్మాణం చేపట్టడం జరిగింది. 16. 7.32 కోట్లు తో 54 పనులను తాండూరు మున్సిపల్ లోని పలు వార్డులలో CC రోడ్లు & డ్రైన్ ల నిర్మాణం కోసం చేపట్టడం జరిగింది. 17. 18.7 కోట్లతో చేపట్టిన CC రోడ్లు, డ్రైన్ లు, కల్వర్టు లు, బాలాజీ నగర్ పార్కు తదితర 113 పనులు పురోగతి లో ఉన్నవి. 18. తాండూరు బైపాస్ రోడ్డు భూసేకరణ కోసం 25 కోట్లు మంజూరు అయినవి. బైపాస్ రోడ్డు కోసం భూములు కోల్పోయిన వారికి నష్టం జరగకుండా వారికి నష్టపరిహారం పెంచడం జరిగింది. 19. దాదాపు 7.80 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా తాండూరు నియోజక వర్గం లోని పాఠశాలల్లో పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. 20. తాండూరు లోని హిందూ ఉత్సవ సమితి అభివృద్ధి కోసం బైపాసస్ రోడ్డు సమీపంలో భూమిని కేటాఇంచడం తో పాటు 50 లక్షల రూపాయలను DMFT నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. 21. ముదిరాజ్ భవనం, కురుమ భవనల నిర్మాణం కోసం తాండూరు లోని బైపాసస్ రోడ్డు సమీపంలో భూమిని కేటాఇంచడం తో పాటు ఒక్కో దానికి 50 లక్షల చొప్పున కోటి రూపాయలను మంజూరు చేయడం జరిగింది. 22. తాండూరు లో దాదాపు 7.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం. 23. దాదాపు 14.3 కోట్లతో తాండూరు నియోజకవర్గం లోని తండాలకు BT రోడ్ల నిర్మాణం. https://www.dharshininews.com/44051/