schedule Thursday, September 03, 2026

హింస రాజకీయాలకు కుట్ర సరికాదు

calendar_today August 5, 2026
person dharshininews
హింస రాజకీయాలకు కుట్ర సరికాదు
హింస రాజకీయాలకు కుట్ర సరికాదు - శాంతిభద్రతలకు విఘాతాలను సమర్థించం - జావిద్‌ అనుచరులు రాద్దాంతాలు మానుకోవాలి - మున్సిపల్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు - రాజీవ్ కాలనీ కాంగ్రెస్ కార్యకర్తకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : హింస రాజకీయాలను సృష్టించేందుకు కుట్రలు చేయడం సరికాదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజులు అన్నారు. బుధవారం పట్టణంలోని రాజీవ్ కాలనీలో జరిగిన ఘర్షణలో దాడికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోహిజ్‌ను వారు పరామర్శించారు. ధైరంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ అనుచరులు కాలనీలో హింసాత్మక చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శాంతియుతంగా జరుగుతుండగా కార్యక్రమాలను రాజకీయ కుట్రలకు వేదికగా మార్చే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కావాలనే వేడుకల వద్దకు వచ్చి.. గోడవలకు కారకులు అయినట్లు స్థానికులు పేర్కొనడం ఘర్షణ ఉద్దేశ పూర్వకంగా జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేశారు. పైగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఉద్రిక్తతలకు కారకులు వారే కాదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలు, జన్మదిన వేడుకలను వివాదాస్పదం చేయడం ప్రజలు సమర్థించరని నాగరాజు అన్నారు. https://www.dharshininews.com/44045/