schedule Thursday, September 03, 2026

ఇదేం రౌడీయిజం..?

calendar_today August 5, 2026
person dharshininews
ఇదేం రౌడీయిజం..?
ఇదేం రౌడీయిజం..? - అభివృద్ధిని అడిగితే దాడి చేస్తారా - తాండూరు రాజీవ్ కాలని యువకుడి ఆరోపణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ నాయకులు తనపై రౌడీయిజం ప్రదర్శించారని రాజీవ్ కాలనీకి చెందిన యువకుడు ఆరోపించాడు. కాలనీ అభివృద్ధి చేయాలని కోరినందుకే తనపై నాయకులు దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రాజీవ్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపాడు. బాధితుడి కథనం ప్రకారం.. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల కోసం కాంగ్రెస్ నాయకులు కాలనీకి వచ్చిన సమయంలో కాలనీ అభివృద్ధి చేయాలని ప్రస్తావించగా కొందరు కాంగ్రెస్ నాయకులు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా కాలనీకి అభివృద్ధి పనులు మంజూరు చేస్తారనే ఆశతోనే సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లానని, అయితే తన వినతిని పట్టించుకోవాల్సిన బదులు దాడి చేశారని వాపోయాడు. జరిగిన ఘటనపై తనపై దాడి చేసిన వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు కూడా తెలిపాడు. నాయకుల అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడిగితే రౌడీయిజం ప్రదర్శించారని విమర్శించాడు. https://www.dharshininews.com/44034/