schedule Thursday, September 03, 2026

ప్రజా ఆరోగ్యంపై దృష్టి..!

calendar_today August 3, 2026
person dharshininews
ప్రజా ఆరోగ్యంపై దృష్టి..!
ప్రజా ఆరోగ్యంపై దృష్టి..! - ఓపెన్‌ జిమ్‌లతో వ్యాయామం - చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి - 12వ వార్డులో పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 12వ వార్డులో రూ. 5లక్షలతో చేపడుతున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులను చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, యువతతో పాటు అన్ని వయసుల వారు వ్యాయామం చేసేలా ఓపెన్ జిమ్ పార్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షులు బాతుల నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44026/