schedule Thursday, September 03, 2026

శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి

calendar_today July 21, 2026
person dharshininews
శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి
శ్రీకృష్ణవేణి టాలెంట్‌లో ఎలక్షన్స్‌ సందడి - ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు - విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొదించుకోవాలి - పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఎన్నికల సందడి ఏర్పడింది. మంగళవారం పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి లీడర్ల కోసం ఎన్నికలు నిర్వహించారు. స్కూల్‌ పీపుల్ లీడర్‌ కోసం 10వ తరగతి విద్యార్థులు పోటీ పడగా.. అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్ కోసం 9వ తరగతి విద్యార్థులు పోటీ పడ్డారు. పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు విద్యార్థుల లీడర్ల ఎన్నిక కోసం ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికల మాదిరి పాఠశాలలో బ్యాలెట్‌ బ్యాక్సులను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగం ఎంత ప్రాధాన్యమైనదో తెలుసుకునేందుకు ఎన్నికలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. మన ఓటు మన భవిష్యత్తు, ఓటు మన హక్కు, ప్రజాస్వామ్యానికి రక్ష అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయనతో పాటు కరస్పాండెంట్ పట్లోళ్ళ సర్వోత్తం రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ విద్యారుల నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశనుంచే అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో క్రమశిక్షణ, బాధ్యత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం వంటివి పెంపొందుతాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం అని ఓటుహక్కు ప్రాధాన్యతను వివరించారు. దేశ భవిష్యత్తు అయినా పాఠశాల భవిష్యత్తు అయిన విద్యార్థుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు అని అన్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులు పాఠశాలలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పఠశాల ప్రిన్సిపాల్ రమేష్, సినీయర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43860/