schedule Thursday, September 03, 2026

ఎస్‌ఐఆర్‌పై హస్తం దూకుడు..!

calendar_today July 21, 2026
person dharshininews
ఎస్‌ఐఆర్‌పై హస్తం దూకుడు..!
ఎస్‌ఐఆర్‌పై హస్తం దూకుడు..! - కార్యక్రమంపై నేతలకు అప్రమత్త సూచన - 23న తాండూరులో సమీక్షా సమావేశాలు - ప్రకటించిన తాండూరు కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్ కార్యక్రమంపై తాండూరు కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. ఎస్‌ఐఆర్ ద్వారా ఓటర్లను కాపాడుకునేందుకు నేతలు, కార్యకర్తలు, బీఎల్‌ఏలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 23వ తేదిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తాండూరు నియోజకవర్గ ఎస్ఐఆర్ కన్వీనర్, టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు 23వ తేది గురువారం మండలాల వారిగా బీఎల్‌ఏలతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి ఎస్‌ఐఆర్‌ పర్యవేక్షకులుగా టీపీసీసీ కోటిం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ పాల్గొంటారని తెలిపారు. సమీక్షా సమావేశాలు మండలాల వారిగా ఉదయం 09:30 గంటలకు తాండూరు పట్టణం, 11గంటలకు బషీరాబాద్, మధ్యాహ్నం 12:30 గంటలకు యాలాల్, మధ్యాహ్నం 2:30గంటలకు తాండూరు రూరల్, సాయంత్రం 4గంటలకు పెద్దేముల్ మండలాలపై జరుగుతాయని వివరించారు. కావున ఈ సమావేశాలకు మండల పార్టీ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తప్పక పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/43856/