బీజేపీది కిరాతక పాలన
July 21, 2026
dharshininews
బీజేపీది కిరాతక పాలన
- విద్యార్థుల ఆత్మహత్యల పాపం కేంద్రానిదే
- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
- నీట్ దోషులను కఠినంగా శిక్షించాలి
- కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో బీజేపీ ప్రభుత్వం కిరాతక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ కుమార్ అన్నారు.
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఆ పాపం కేంద్రానిదే అని అన్నారు. న్యాయం కోసం శాంతియుతంగా నిరసన చేపడితే లాఠీ చార్జి చేయించడం కిరాతకానికి నిదర్శనం అని విమర్శించారు.
విద్యార్థుల ఆవేదనకు, ఆత్మహత్యలకు కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల పోరాటంలో రాహుల్ గాంధీ పూర్తి మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
https://www.dharshininews.com/43853/