schedule Thursday, September 03, 2026

బస్సులో పర్సు మరిచిన మహిళ

calendar_today July 20, 2026
person dharshininews
బస్సులో పర్సు మరిచిన మహిళ
బస్సులో పర్సు మరిచిన మహిళ - అందులో నగదు, విలువైన పత్రాలు - నిజాయితితో తిరిగిచ్చిన బస్‌ కండక్టర్ - అభినందించిన తాండూరు డీఎం ప్రవీణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో పర్సు మరిచి పోయిన మహిళ ప్రయాణికురాలుకు బస్‌ కండక్టర్‌ నిజాయితీతో తిరిగి ఇప్పించాడు. ఈ సంఘటన సోమవారం తాండూరు ఆర్టీసీ డీపో పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పుష్పలి శశికల తాండూరుకు వచ్చేందుకు తాండూరు–కొత్లాపూర్ బస్సులో బయల్దేరింది. బస్సుదిగే సమయంలో ఆమె తన పర్సును బస్సులోనే మరిచిపోయి దిగిపోయారు. బస్సు విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ఎన్. రవి పర్సును గమనించారు. వెంటనే తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి పర్సును అప్పగించారు. అనంతరం డిపో అధికారులు పర్సులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ఫోన్ నంబర్‌ను గుర్తించి శశికళకు సమాచారం అందించారు. అందులో సుమారు రూ.5,000 నగదుతో పాటు విలువైన వ్యక్తిగత పత్రాలు ఉన్నాయి. తన పోగొట్టుకున్న పర్సును తిరిగిఇప్పించినందుకు శశికళ కండక్టర్ ఎన్. రవి గారికి, డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బస్‌ కండక్టర్ నిజాయితిని చాటుకోవడం పట్ల డీపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ అతన్ని అభినందించారు. https://www.dharshininews.com/43849/