schedule Thursday, September 03, 2026

మంత్రుల పర్యటన వాయిదా..!

calendar_today July 15, 2026
person dharshininews
మంత్రుల పర్యటన వాయిదా..!
మంత్రుల పర్యటన వాయిదా..! - హ్యామ్ పనులకు స్మాల్ బ్రేక్ - శంకుస్థాపనలకు మరో డేట్‌ను ఫిక్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో రేపు గురువారం జరగాల్సిన మంత్రుల పర్యటన వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ పథకం కింద తాండూరు నియొజకవర్గంలో రూ. 290 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు తాండూరులో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబులు హాజరు అవుతారని ప్రకటించారు. అయితే అధిష్టానం మంత్రులతో సమావేశం నిర్వహించనున్నడంతో తాండూరులో రేపు జరగాల్సిన మంత్రుల పర్యటన వాయిదా పడింది. మంత్రుల పర్యటనను ఈనెల 18వ తేదికి మారుస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించాలని పార్టీ నేతలు సూచించారు. https://www.dharshininews.com/43778/