జిల్లా ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించాలి
July 14, 2026
dharshininews
జిల్లా ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించాలి
- ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాన్ని సహించం
- చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మౌనం వీడాలి
- తాండూరు బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలనే ప్రయత్నాన్ని సహించేది లేదని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.
మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, ఎజాజ్, కరుణాకర్ తదితరులు సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తరలించాలనుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మౌనం వీడి స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని తరలించే నిర్ణయం తీసుకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43758/