schedule Thursday, September 03, 2026

ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..!

calendar_today July 10, 2026
person dharshininews
ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..!
ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..! - ఎలాంటి రాతపరీక్షలు లేకుండానే ఎంపిక - అర్హతలు, వయోపరిమితి వివరాలు ఇలా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో కండక్టర్ కొలువులు రాబోతున్నాయి. ఎలాంటి రాతపరీక్షలు లేకుండానే ఉద్యోగాలను ఎంపిక చేయబోతున్నారు. త్వరలోనే ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. సుమారు 1500 కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను భర్తి చేయబోతున్నారు. ఆర్టీసీలో ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. కానీ కొత్తగా కండక్టర్ల నియామకాలను మాత్రం చేపట్టలేదు. దీంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ ఉద్యోగాలను భర్తి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. కండక్టర్ ఉద్యోగానికి అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, దరఖాస్తుకు చివరి తేదీ తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. కండక్టర్‌ పోస్టుకు ఎంపికై టికెట్ టికెట్.. రైట్ రైట్ అంటూ మీరు కూడా డ్యూటీ చేయొచ్చు. https://www.dharshininews.com/43735/