ఉచితంగా బైకు, స్కూటీలు..!
July 5, 2026
dharshininews
ఉచితంగా బైకు, స్కూటీలు..!
- తెలంగాణ సర్కారు సూపర్ గిఫ్ట్
- అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
- ఎవరు, ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని లబ్దిదారులకు రేవంత్ సర్కారు ఉచితంగా బైకులు, స్కూటీలు, కుట్టు మిషన్లను అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలకు ఉచితంగా బైకులు, స్కూటీలు, కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రకటన చేశారు. ఇందుకోసం ఓబీఎంఎంఎస్ పోర్టల్ ఆయన ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీలు దరఖాస్తులు చేసుకోవచ్చు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి క్రిస్టియన్, మైనార్టీల వర్గాల యువత చిన్న చిన్న వ్యాపారులు మొదలుపెట్టి స్వయంశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం బైక్స్, స్కూటీలు, కుట్టు మిషన్లు, మోటార్ బైక్స్, చిన్న వ్యాపార యూనిట్లను మంజూరు చేయనుంది.
దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలంటే..?
ఆయా వర్గాలకు చెందిన లబ్దిదారులు జులై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం tscmfc.in వెబ్‌సైట్ సందర్శించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సందేహాల కోసం 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని కోరింది. ఇక బైక్, స్కూటీ కోసం దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. tsobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత సూచించారు.
అర్హులను ఎలా గుర్తిస్తారంటే..?
ఈ పథకం కోసం పలు విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణాల్లో లబ్ది పొందాలనుకునేవారి కుటుంబ వార్షియ ఆదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల్లోపు ఉండాలి. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
https://www.dharshininews.com/43687/