schedule Thursday, September 03, 2026

మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!

calendar_today July 1, 2026
person dharshininews
మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!
మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..! - బీఆర్ఎస్ వార్డులపై నియంత పాలన - రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఆక్రోశం తాండూరు,  :  మున్సిపల్ పరిధిలో ఉన్న మా వార్డును అభివృద్ధి చెయ్యమని అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాన్సిల్ సమావేశం విషయంలో చైర్ పర్సన్ తో భేటీ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధి గురించి చర్చించగా చైర్ పర్సన్ సానుకూలంగా స్పందించలేదని తెలిపారు. పైగా వార్డు నుంచి మున్సిపల్ కు ఉపయోగం లేదని అన్నారని ఆరోపించారు. ఈ కారణంగా వార్డును అభివృద్ధి చెయ్యమని అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ల వార్డులపై నియంత పాలన చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే వార్డు ప్రజలతో ఇంటి వద్ద ఆందోళనలు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. https://www.dharshininews.com/43658/