schedule Thursday, September 03, 2026

సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..!

calendar_today June 30, 2026
person dharshininews
సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..!
సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..! - ఘనంగా అమ్మవారి జాతర ఉత్సవాలు - దర్శించుకున్న మాజీ చైర్ పర్సన్, నేతలు - బోనాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడు సవరమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలో వెలసిన సవరమ్మ దేవాలయ జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహిళా భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాలతో వచ్చిన మహిళలు దేవాలయంలో ప్రదక్షణలు చేశారు. ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జాతర ఉత్సవాల సందర్బంగా అమ్మవారిని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, నాయకులు క్రిష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, పూజారి పాండు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్ తదితరులు దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు ప్రజలపై చల్లని ఆశీస్సులు ఉంచాలని వేడుకున్నారు. https://www.dharshininews.com/43651/