schedule Friday, September 04, 2026

సర్కారు బడులకు మహర్థశ..!

calendar_today June 14, 2026
person dharshininews
సర్కారు బడులకు మహర్థశ..!
సర్కారు బడులకు మహర్థశ..! - పాఠశాలల ప్రహారిలకు రూ. 2.56 కోట్లు మంజూరు - ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని సర్కారు బడులకు మహర్ధశ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రహారిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు ఆదివారం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలతో పాటు కోట్‌పల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రహారీ గోడలను నిర్మించేందుకు ఈ నిధులను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తం 42 పాఠశాలలకు రూ. 50వేలు, రూ.2, రూ.4, రూ. 5, రూ. 7 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల 56 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి పెద్ద పీట వేస్తోందని అన్నారు. ఈ నిధులతో త్వరగా ప్రహారి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూస్తామని తెలిపారు. https://www.dharshininews.com/43521/