schedule Friday, September 04, 2026

ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి

calendar_today June 7, 2026
person dharshininews
ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి
ఎరువుల అధిక ధరలపై ఉక్కుపాదం వేయండి - ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేయించండి - డీలర్ల లైసెన్స్‌ల రద్దుకు చర్యలు తీసుకోండి - జిల్లా కలెక్టర్‌తో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులకు అధిక ధరలకు ఎరువుల విక్రయాలు చేపట్టకుండా ఉక్కుపాదం వేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, వెంటనే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ ప్రారంభ సంధర్బంగా ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకవచ్చారని వివరించారు. వర్షాలు ప్రారంభం కాగానే రైతులు వ్యవసాయ సాగుపనులకు సిద్దమవుతున్నారని, పంటల కోసం రైతులకు ఎరువులు అవసరం ఉంటుందని అన్నారు. కాని ఫర్టిలైజర్ షాపుల యజమానులు ఎరువులను అధిక ధరలకు విక్రయించడం వల్ల సన్న, చిన్నకారు రైతులు ఎరువులు కొనలేకపోతున్నారని తెలిపారు. కావున వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయించి, అధిక ధరలకు అమ్మే డీలర్ల లైసెన్సులు రద్దు చేయించాలని కోరారు. రైతులకు ఎరువుల కష్టాలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/43474/