schedule Friday, September 04, 2026

సర్‌ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు

calendar_today June 6, 2026
person dharshininews
సర్‌ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు
సర్‌ శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు - 9వ తేదికి మార్చినట్లు కన్వీనర్‌ కేపీఆర్ వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 7న తాండూరులో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల సమగ్ర సవరణ(సర్‌) శిక్షణ శిబిరం నిర్వహణలో మార్పు జరిగినట్లు సర్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్, టీపీసీసీ ప్రచార సమన్వకర్త కరణం పురుషోత్తం రావు తెలిపారు. ఓటర్ల సవరణలో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూడడంతో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్‌ కార్యక్రమంపై బీఎల్‌ఏలకు, పార్టీ నాయకులకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఈనెల 7న తాండూరులో నియోజకవర్గ స్థాయి సర్‌ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు చేయడం జరిగిందని కన్వీనర్ కరణం పురుషోత్తం రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ శిక్షణ కార్యక్రమాన్ని 9వ తేదికి మార్చినట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని వినాయక ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్పును అందరు గమనించాలని సూచించారు. 9న జరిగే శిక్షణ కార్యక్రమానికి పార్టీ నేతలు, బీఎల్‌ఏలు, నాయకులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/43460/