schedule Friday, September 04, 2026

సర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర

calendar_today June 2, 2026
person dharshininews
సర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర
సర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర - అర్హులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ దృష్టి - నియోజకవర్గ కన్వీనర్‌గా కరణం పురుషోత్తం రావు నియామకం - మీడియా ముందు ప్రకటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌(సర్‌)తో ఓట్ల తొలగింపుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల ప్రక్షాళన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. సర్‌ పేరుతో ఓటర్ల తొలగింపుకు కుట్ర చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంందని అన్నారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాలలో పార్టీ కన్వీనర్లను నియమిస్తుందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గ సర్‌ కన్వీనర్‌గా సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావును ఏకగ్రీవంగా నియమించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే సర్‌ కార్యక్రమం కోసం 269 మంది బీఎల్ఏలను నియమించడం జరిగిందని తెలిపారు. ఓటర్ల తొలగింపులో అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు కన్వీనర్‌గా కరణం పురుషోత్తం రావు పూర్తి బాధ్యతతో పనిచేస్తారని నమ్మకం ఉందని అన్నారు. ఆయన పర్యవేక్షణలో కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, బీఎల్ఏలు సమన్వయంగా పనిచేయాలని పేర్కొన్నారు. మరోవైపు కన్వీనర్‌గా నియామకమైన కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ సర్‌తో అర్హులను తొలగించకుండా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43427/