schedule Friday, September 04, 2026

తాండూరు మహిళ సమాఖ్యలకు అభయం

calendar_today June 2, 2026
person dharshininews
తాండూరు మహిళ సమాఖ్యలకు అభయం
తాండూరు మహిళ సమాఖ్యలకు అభయం - 100 భవనాలకు రూ. 10 కోట్ల మంజూరు - వెల్లడించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని మహిళ సమాఖ్యలకు రాజయోగం దక్కింది. నియోజవర్గంలో ఉన్న మహిళ సమాఖ్యలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ద్వారా చేయూత అందబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళ సమాఖ్యలకు సంబంధించిన భవనాల నిర్మాణం కోసం రూ. 10లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని మహిళ సమాఖ్య భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండాలల్లో 100 మహిళ సమాఖ్యలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. నాలుగు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 100 మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి సుమారు రూ.10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నూతనంగా మంజూరైన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాండూరులోని మహిళ సమాఖ్య భవనాలకు రాజబోతోందని పలు మహిళ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. https://www.dharshininews.com/43425/