schedule Friday, September 04, 2026

ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి

calendar_today June 1, 2026
person dharshininews
ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి
ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించాలి - ఎన్నికల మెనిఫోస్టో హామిలను నెరవేర్చాలి - తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు డా.పిడమర్తి రవి - తాండూరులో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి.. ఎన్నికల మెనిఫోస్టో హామిలను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డా.పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మెనిఫోస్టో ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, హెల్త్ కార్డులు, గౌరవ వేతనం, రవాణా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జూన్ 21న హైదరాబాదులోని ఇందిరా పార్కులో రాష్ట్ర స్థాయి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఉపాధ్యక్షులు ఒంగొని శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్, ప్రకాష్ గౌడ్, జిలాని, శ్రీనివాస్, సుదర్శన్, తాండూర్ ఐక్యవేదిక అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, బంటారం బద్దేశ్వర్, కృష్ణ ముదిరాజ్, కేశవులు, ముజీబ్ ఖాన్, కాశీం పాషా, నాగేందర్, హేమంత్ కుమార్, వీరమణి తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43420/