schedule Friday, September 04, 2026

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

calendar_today May 29, 2026
person dharshininews
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి - తాండూరులో యూత్‌ కాంగ్రెస్ దర్నా - పాల్గొన్న నేతలు, కార్యకర్తలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రం పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని తాండూరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద దర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమేర్ అబ్దుల్, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల అనిల్‌ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. 2014లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధర 2024 వరకు 10 డాలర్లు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇప్పటికే రెండింతలు పెంచారని అన్నారు. వీటి ధరలను పెంచడం వల్ల సామాన్యులు ఉపయోగించే ఉప్పు, పప్పు, వంటి నిత్యవసర వస్తువులతో పాటు కట్టుకునే బట్టలపై కూడా భారం పడుతుందని అన్నారు. పేదలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కేంద్రం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, కె జగదీష్, మండల అధ్యక్షులు సుధాకర్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు సతీష్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు మహేష్, సందీప్ రెడ్డి, శ్రీహరి, మాణిక్, రఫీక్, జగదీష్, నవీన్, తేజ, సునీల్, రామకృష్ణ, సురేష్, సుధీర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43407/