schedule Friday, September 04, 2026

ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

calendar_today May 24, 2026
person dharshininews
ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 22 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు - చదువుకున్న పాఠశాల తోడ్పాటుకు భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo నిర్వహించారు. 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కలుసుకోవడంతో అలనాటి మధురానుభూతులను గుర్తుచేసుకున్నారు. అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు గాలయ్య, ఎoఏ పాషా, శ్రీదేవి, అరుంధతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించడానికి, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ అత్యంత కీలకమైందని అన్నారు. ఇది కేవలం నియమాలను పాటించడం మాత్రమే కాదు, మనల్ని మనం సరైన మార్గంలో నడిపించుకునే ఒక అద్భుతమైన జీవన విధానమని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 22 సంవత్సరాల తర్వాత కలయిక చాలా ఆనందంగా ఉందన్నారు. చదువు నేర్పిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. https://www.dharshininews.com/43371/