schedule Friday, September 04, 2026

కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్

calendar_today May 12, 2026
person dharshininews
కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్
కోఆప్షన్ సభ్యుల ఎంపిక పూర్తిఎంపికకు ముహూర్తం ఫిక్స్ - మున్సిపల్‌లో ఎన్నికకు అన్ని ఏర్పాట్లు - మాజీ కౌన్సిలర్లకు, టిక్కెట్ వదులు కున్నవారికే ప్రాధాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రేపు మున్సిపల్ కార్యాయలంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో పాటు ఎన్నికల్లో టిక్కెట్‌ త్యాగం చేసిన వారికి సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. కోఆప్షన్ సభ్యులుగా 14వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. 15వ వార్డు నుంచి పాత తాండూరుకు చెందిన సీనీయర్ స్వర్గీయ నాయకులు పెంటయ్య కుమారుడు సుభాష్‌ను ఎన్నుకోబోతున్నారు. అదేవిధంగా పట్టణంలోని 17వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ ఆఫ్రీన్ జవేరియాను ఎన్నుకుంటున్నారు. దీంతో పాటు మైనార్టీ కోటాలో పట్టణంలోని సాయిపూర్ 10వ వార్డు నుంచి కౌన్సిలర్ టిక్కెట్‌ను త్యాగం చేసిన మహమ్మద్ రహీంకు అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టిక్కెట్‌ను త్యాగం చేసిన మాజీ కౌన్సిలర్లతో పాటు మైనార్టీ నాయకుడికి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. https://www.dharshininews.com/43289/