చిరస్మరణీయుడు చందు మహరాజ్
May 7, 2026
dharshininews
చిరస్మరణీయుడు చందు మహరాజ్
- వర్ధంతిలో నాయకుల నివాళులు
- పాల్గొన్న చైర్ పర్సన్, నాయకులు
- తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ మాజీ మంత్రి చందు మహరాజ్ ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని తాండూరుకు చెందిన పలువురు నాయకులు అన్నారు.
గురువారం తాండూరు పట్టణం విలియం మూన్ చౌరస్తా వద్ద చందు మహారాజ్ వర్ధంతిని జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు వర్ధంతిలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డా. సంపత్ కుమార్, చందు మహారాజ్ కుమారుడు ఎం నరేష్ మహారాజ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి తదితరులు చందు మహారాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ మంత్రి చందూమహరాజ్ తాండూరు ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజల మనసుల్లో ఆయన చిరస్మరణీయుడుగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాళికా దేవి దేవాలయ చైర్మన్ పి. బస్వరాజ్, మాజీ వైస్ చైర్మన్ ఎంఏ ఆలీం, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, పట్టణ మాజీ అధ్యక్షుడు హబీబ్ లాల, నాయకులు సర్దార్ ఖాన్, బాతుల వెంకటయ్య, సత్యమూర్తి, భీమ్ శంకర్, సుదర్శన్ గౌడ్, భగవాన్, కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43242/