schedule Saturday, September 05, 2026

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

calendar_today April 17, 2026
person dharshininews
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం - బీవీజీ ఫౌండేషన్ ద్వారా డా.సంపత్‌ కుమార్ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి బాధిత కుటుంబానికి తాండూరు సీనీయర్ నాయకులు డా.సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. యాలాల మండలంలోని బండమదిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందాడు. విషయం తెలుసుకున్న తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ బీవిజి ఫౌండేషన్ ద్వారా నర్సిములు భార్య దేవమ్మకు ఆర్ధిక సాయం పంపించారు. ఈ ఆర్థిక సాయాన్ని గ్రామ సర్పంచ్ బెస్త నరేష్ తాను కొంత డబ్బును కలిపి అంత్యక్రియల నిర్వహణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, గ్రామస్తులు బాయికాడి బసన్న పి.చంద్రప్ప , చెట్టుకింది అంజయ్య, సండ్రస హన్మప్ప , దత్తు లక్ష్మణ్, శ్యామప్ప, లక్ష్మయ్య, పకిరప్ప తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43124/