schedule Saturday, September 05, 2026

2వ పీఆర్సీని అమలు చేయాల్సిందే

calendar_today April 17, 2026
person dharshininews
2వ పీఆర్సీని అమలు చేయాల్సిందే
2వ పీఆర్సీని అమలు చేయాల్సిందే - ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలి - యాలాలలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిరసన యాలాల, దర్శిని ప్రతినిధి : ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2వ పీఆర్సీని అమలు చేసి డీఏ/డీఆర్‌లను అమలు చేయాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు టీజీఈజేసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలని మండల తహసీల్దార్ వెంకటస్వామికి వినతిపత్రం అంందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రధానంగా 2వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీఏ/డీఆర్‌లను విడుల చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 13వేల కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ఈహెచ్ఎస్‌ సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ విధానంను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్షులు సి. కృష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి హెచ్ రాములు, ఎంపీడీఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, నాయకులు మహేష్ కుమార్, పరమేష్, వెంకటయ్య, ప్రభాకర్ చారి, శివకుమార్, బాలు, రవి, సంగమేశ్వర్, లక్ష్మీనారాయణ, భ్రమరాంబ, రాణి, వెంకట రమణ, చంద్రశేఖర్, షఫీ, రవీంద్రనాథ్, రవీందర్ రెడ్డి, బలరామ్, సి హెచ్ రమేష్, జోషి రవి, చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43122/