schedule Saturday, September 05, 2026

వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు

calendar_today April 16, 2026
person dharshininews
వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు
వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు - తరువాత జర్నలిస్టులకు శిక్షణ తరగతులు - టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే నెల మేలో వికారాబాద్‌ జిల్లాలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారి తెలిపారు. గురువారం శామీర్‌పేట్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాలో టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు నిర్వహించడంలో ఆలస్యం జరిగిందని అన్నారు. వచ్చేనెల మేలో జిల్లా మహసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో సభ్యత్వాలు పూర్తి చేసి.. తుది జాబితా సిద్దం చేయడం జరిగిందన్నారు. ఈ జాబితాను రాష్ట్ర కమిటికి అందిస్తామని చెప్పారు. మరోవైపు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. https://www.dharshininews.com/43107/