schedule Friday, September 04, 2026

కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి

calendar_today April 11, 2026
person dharshininews
కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి
కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి - ప్రజా పాలనపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్‌ - బీఆర్ఎస్ బూటకపు రాజకీయాలను ఎవ్వరు నమ్మరు - కాంగ్రెస్ కౌన్సిలర్‌ వైషాలి రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆ పార్టీ తాండూరు మున్సిపల్ పరిధి 26వ వార్డు కౌన్సిలర్ వైషాలి రాజుగౌడ్‌ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, నేతలు చేస్తున్న వాఖ్యలను ఖండించారు. కొంతమంది రెండు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ నాయకుల పైన లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు మాయమాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలి తప్పా రాజకీయాలు చేయరాదని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ దళిత బందు, బీసీ బంధు పథకాలు అమలు చేసి పేదల సొంతింటి కలను విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు మంజూరు, రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూంలు అందిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలో 36 వార్డులకు వార్డుకు 12 డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో దాచుకోవడానికి అలవాటు పడ్డ మీరు ప్రజల గురించి పేద ప్రజల గురించి మాట్లాడం దయ్యాలు వేదాంతలు పలికినట్లు ఉందని విమర్శించారు. ఇప్పటికైనా దుమ్మెత్తి పోయడం మానుకుని ప్రజలకు మేలు చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. https://www.dharshininews.com/43027/