schedule Friday, September 04, 2026

భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

calendar_today April 2, 2026
person dharshininews
భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం - ఇందిరానగర్‌ రామమందిరంలో ఆధ్యాత్మిక శోభ - పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. గురువారం హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని రామ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక పారాయణంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు అనిల్, నాగారం మల్లేశం, భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్దలతో పఠించారు. హనుమాన్ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈకార్యక్రమంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు, దేవాలయ కమిటి సభ్యులు, భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. https://www.dharshininews.com/42923/