schedule Friday, September 04, 2026

తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి

calendar_today March 26, 2026
person dharshininews
తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి
తాండూరు స్టోన్‌ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలి - ప్రభుత్వ కార్యాలయల్లో వినియోగంకు జీఓ తీసుకరావాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నాపరాతి వినియోగానికి ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక జీవోను ప్రవేశ పెట్టాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులోని నాపరాతిపై మాట్లాడారు. తాండూరులోని నాపరాతికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. షాబాద్‌ స్టోన్‌గా పేరుగాంచిన నాపరాతిని అందరు వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం టైల్స్, ఇతర పద్దతులు అమల్లోకి రావడంతో షాబాద్ స్టోన్ వాడకం తగ్గిందని అన్నారు. కావున షాబాద్‌ స్టోన్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించేలా ప్రత్యేక జీవోను తీసుకరావాలని విజ్ఞఫ్తి చేశారు. గతంలో కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో సభా దృష్టికి తీసుకవచ్చినట్లు గుర్తుచేశారు. తాండూరు షాబాద్‌ స్టోన్‌ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. https://www.dharshininews.com/42827/