schedule Friday, September 04, 2026

దోబీఘాట్.. రగడ..!

calendar_today March 26, 2026
person dharshininews
దోబీఘాట్.. రగడ..!
దోబీఘాట్.. రగడ..! - రజకులపై చేయి చేసుకున్న కౌన్సిలర్‌..? - తాండూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు - ప్రహారీగోడ కూల్చీవేతపై వివాదం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రజకులకు సంబంధించిన దోబీఘాట్ విషయంలో అధికార పార్టీ కౌన్సిలర్‌, రజకుల మద్య వివాదం చోటు చేసుకుంది. రజకులపై వార్డు కౌన్సిలర్‌ చేయి చేసుకోవడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. బాధిత రజకులు కౌన్సిలర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం ఆర్డీఓ కార్యాలయ వెనుక ప్రాంతంలో రజకులకు సంబంధించిన దోబీఘాట్ ఉంది. దాని పక్కన స్మశాన వాటిక కూడా ఉంది. దోబీఘాట్‌కు అనుకుని ఉన్న ప్రాంతంలో స్మశాన వాటిలో భవనం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులను 22వ వార్డు అధికార పార్టీ కౌన్సిలర్ రాము పరిశీలిస్తున్నారు. రెండు రోజల క్రితం దోబీఘాట్ ప్రహారి గోడను కౌన్సిలర్‌ రాము కూల్చివేయించినట్లు వారు ఆరోపించారు. తాజాగా గురువారం పనుల వద్ద ఉన్న రామును రజక సంఘం నాయకులు ప్రశ్నించేందుకు వెళ్లగా వివాదం ముదిరింది. ఈ క్రమంలో కౌన్సిలర్ రాము రజక జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.క్రిష్ణతో పాటు తాండూరు అధ్యక్షలు రాజులపై చేయి చేసుకున్నారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు నచ్చజెప్పడం జరిగిందని తెలిపారు. కౌన్సిలర్‌పై రాముపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం నాయకులు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు రజకులు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ రాము దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. రజక సంఘం నాయకులపై చేయి చేసుకున్నందుకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. https://www.dharshininews.com/42820/