schedule Friday, September 04, 2026

నిరాశ.. నిస్సారపు బడ్జెట్..!

calendar_today March 25, 2026
person dharshininews
నిరాశ.. నిస్సారపు బడ్జెట్..!
నిరాశ.. నిస్సారపు బడ్జెట్..! - పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం కరువు - ప్రజా సంక్షేమానికి దక్కని అగ్రస్థానం - కంటి తుడుపులో ఎమ్మెల్యే, ఎంపీ నిధులు - బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌ ఆవేధన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌ వార్షిక బడ్జెట్‌ తీవ్ర నిరాశ, నిస్సారాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 27 కోట్లతో బడ్జెట్‌ ప్రకటించారని తెలిపారు. పట్టణాభివృద్ధికి, ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరాశ కలిగించే విధంగా ఉందని అన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉండాల్సిన బడ్జెట్‌లో అభివృద్ధి, పథకాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు గానీ, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పేదల సంక్షేమ పథకాలు గానీ బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. డీపీఆర్ కోసం ఖర్చు చేసిన రూ. 38.50 లక్షల రూపాయలపై పూర్తి వివరాలు లేకపోవడం పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. దీంతో పాటు మెప్మా విభాగానికి కేటాయించిన నిధుల వినియోగంపై కూడా సరైన వివరాలు ఇవ్వలేదని అన్నారు. 70 వేల జనాభా ఉన్న తాండూరు పట్టణానికి రూ. 20,30 కోట్లు అవసరం ఉండగా ఎమ్మెల్యే ఫండ్ కేవలం రూ1 కోటి మాత్రమే కేటాయించడం విచారకరం అని అన్నారు. ఎంపీ నిధులు కూడా కేవలం రూ.50 లక్షలు మాత్రమే ఇవ్వడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఫండ్‌ నుంచి కూడా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యకరం అని అన్నారు. ముగింపుగా తాండూరు ప్రజల అభివృద్ధి కోసం సరైన ప్రణాళిక, పారదర్శకత, తగిన నిధుల కేటాయింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/42803/