schedule Saturday, September 05, 2026

రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..!

calendar_today March 20, 2026
person dharshininews
రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..!
రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు అన్యాయం..! - ఆయన గిరిజన జాతిని కించపరచలేదు - సొంత జాతిని ఆదుకోని ధారాసింగ్ - ఖండించిన నేతలకు బంజారా సమాజ్‌కు సంబంధం లేదు - బీఆర్ఎస్ మున్సిపల్‌ కౌన్సిలర్‌ సురేష్‌ నాయక్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఫిర్యాదు చేయడం అన్యాయమని తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డు పార్టీ కౌన్సిలర్ సురేష్‌ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌పై రాజుగౌడ్‌ చేసిన వాఖ్యలు చేయడం పట్ల బంజారా సమాజ్ నేతలు చేసిన కౌంటర్‌ను ఖండించారు. రాజుగౌడ్‌ ధారాసింగ్‌పై చేసిన వాఖ్యలు సబబే అని అన్నారు. ధారాసింగ్‌ ఏనాడా తన సొంత జాతిని పట్టించుకోలేదని అన్నారు. గిరిజన జాతిని ఆయన ఏనాడు ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు. అదేవిధంగా గిరిజన కోటాలో ప్రభుత్వ పథకాలను సొంత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గిరిజనుల పట్ల ఆయన ధోరణిని రాజుగౌడ్‌ ఎండగట్టారని అన్నారు. అయినా కూడా రాజుగౌడ్‌ గిరిజన జాతిని లక్ష్యంగా చేసుకుని వాఖ్యలు చేయలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అని అన్నారే తప్పా గిరిజనులను కించపరచలేదని స్పష్టం చేశారు. బంజారా సమాజ్‌ నాయకులు ఎస్సీ, ఎస్టీ కేసుకు ఫిర్యాదు చేయడం అన్యాయని అన్నారు. రాజుగౌడ్‌ వాఖ్యలు చేసిన నేతలు గోపాల్, అనిల్‌ రాథోడ్‌లకు.. బంజారా సమాజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా ధారాసింగ్ ఇలాంటి నీచ రాజకీయాలను మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, మాజీ కౌన్సిలర్ భీంసింగ్, బాబు నాయక్ తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/42699/