schedule Saturday, September 05, 2026

25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి

calendar_today March 18, 2026
person dharshininews
25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి
25వ వార్డులో సమస్యలు పరిష్కరించండి - వాటర్‌ బోర్లు, హైమస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి - బీఆర్ఎస్ యువనాయకులు ఎజాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ నసీరా భాను ప్రతినిధి, యువనాయకులు ఎజాజ్ కోరారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25వ వార్డులో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. ప్రజల కోసం అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్తగా 4 బోరుమోటార్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా పాత బడిన బోర్లకు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తెచ్చే విధంగా దృష్టిసారించాలని కోరారు. దీంతో పాటు వార్డులో హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా వార్డులో మురుగు కాలువల ఇబ్బంది ఉందని, రోడ్లపై మురుగు పారకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. https://www.dharshininews.com/42621/ https://www.dharshininews.com/42626/