schedule Thursday, September 03, 2026

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

calendar_today March 13, 2026
person dharshininews
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - బషీరాబాద్‌ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చేపల కోసం చెరువులో దిగిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం బషీరాబాద్‌ మండలంలోని మాసన్‌పల్లి వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు. కొద్ది సేపటికి వెంకటయ్య నీటి మునిగి పోయాడు. శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఏరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు బషీరాబాద్‌ ఎస్ఐ నూమన్ అలీ తెలిపారు. https://www.dharshininews.com/42476/