schedule Saturday, September 05, 2026

అనారోగ్యంలోనూ ప్రజాసేవ..!

calendar_today March 8, 2026
person dharshininews
అనారోగ్యంలోనూ ప్రజాసేవ..!
అనారోగ్యంలోనూ ప్రజాసేవ..! - సలాం కౌన్సిలర్ జావిద్ భాయ్‌ - పైపులైన్, విద్యుత్ మరమ్మత్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆదివారం లేదు.. అనారోగ్యం లేదు.. నమ్మిన ప్రజల కోసం సేవే ముఖ్యం అని తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్‌ జావిద్‌ విశ్వాసాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే వార్డులోని కాలనీలలో సమస్యలు ఉన్నట్లు ప్రజలు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఆదివారం అయినప్పటికి, అధికారులు అందుబాటులో లేని సమయంలో కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపించారు. కాలనీలో తాగునీటి పైపులైన్‌ మరమ్మత్తులు చేయించారు. అదేవిధంగా విద్యుత్ స్థంబానికి మరమ్మత్తులు చేయించారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ జావిద్ బాయ్ చూపిస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ కాలనీలో సమస్యలపై కమీషనర్, అధికారుల దృష్టికి తీసుకవెళ్లినా స్పందించలేదని తెలిపారు. నమ్మి గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. https://www.dharshininews.com/42333/