schedule Saturday, September 05, 2026

తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..!

calendar_today March 2, 2026
person dharshininews
తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..!
తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..! - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌గా మాజీ డీపీసీ సభ్యులు, పట్లోళ్ల నర్సింలు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలును మార్కెట్ కమిటి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో మార్కెట్ కమిటి చైర్మన్‌గా అవకాశం కల్పించడం పట్ల తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పట్లోళ్ల నర్సింలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల కోసం, మార్కెట్ కమిటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. https://www.dharshininews.com/42240/