schedule Saturday, September 05, 2026

ఘనంగా సైన్స్ దినోత్సవం

calendar_today February 28, 2026
person dharshininews
ఘనంగా సైన్స్ దినోత్సవం
ఘనంగా సైన్స్ దినోత్సవం - ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవంను పురస్కరించుకొని శనివారం ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. [video width="656" height="480" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-28-at-6.02.27-PM.mp4"][/video] పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రయోగంశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ ఎఫెక్ట్, జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వివిధ రకాల నమూనాలు చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే నూతన ఆవిష్కరణలను కనుగొనే విధంగా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు సృజనాత్మక పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42206/