schedule Thursday, September 03, 2026

మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!

calendar_today February 28, 2026
person dharshininews
మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!
మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..! - సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య..? - వికారాబాద్‌లో ఘటన, పోలీసుల దర్యాప్తు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య కోట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంది. ఆమెను ధారూర్ సీఐ కార్యాలయంకు అటాచ్‌ చేయడంతో ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. అయితే శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంభీకులకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానిఇ చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన దివ్య సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. https://www.dharshininews.com/42197/