schedule Saturday, September 05, 2026

గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..!

calendar_today February 26, 2026
person dharshininews
గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..!
గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..! - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - రూ. 92లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని గ్రామాలను ప్రగతి బాట పట్టించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో దాదాపు రూ.92 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. మైల్వార్ గ్రామంలో రూ.11.20 లక్షలతో ప్రహరీ గోడ, రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులు, రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించే మహిళా సమైక్య భవనంకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇస్మాయిల్ పూర్ గ్రామంలో (ఏకాంబరి దేవాలయం) రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులతో పాటు రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించే మహిళా సమైక్య భవనంకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఎక్మాయ్ గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు, రూ.10 లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(DMFT) మరియు రూ.10.15 లక్షలతో ప్రభుత్వ పాఠశాల పహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు ,ఎమ్మెల్యే సోదరులు బుయ్యని సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్‌లు సీమా సుల్తాన ఖలీద్, పుప్పలి శశికళ మధుసూదన్, నామ్య నాయక్, వెంకటేష్ మహారాజ్, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, రాకేష్ మహారాజ్, సుధాకర్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, వివిధ గ్రామాల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. https://www.dharshininews.com/42172/