schedule Saturday, September 05, 2026

మెరుగైన సేవలందించాలి

calendar_today February 14, 2026
person dharshininews
మెరుగైన సేవలందించాలి
మెరుగైన సేవలందించాలి - తాండూరులో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ప్రారంభం - పాల్గొన్న నర్మదాదేవిరెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని తాండూరు మహిళా నాయకులు పుల్లా నర్మాదదేవి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌లు అన్నారు. శనివారం తాండూరు పట్టణం పాత మహిళ బ్యాంకు వద్ద కొత్తగా ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని పుల్లా నర్మదాదేవి రెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మాజీ కౌన్సిలర్లు శోభారాణి, పరిమళ, విజయాదేవి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా ప్రజలకు, కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. సేవలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ముత్తూట్ గ్రూప్‌ రిజీనల్ మేనేజర్ శ్రీనివాస్, బంటారం రాములు. సిబ్బంది తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/41279/