schedule Saturday, September 05, 2026

ప్రశాంతంగా మున్సి'పోల్స్'..!

calendar_today February 11, 2026
person dharshininews
ప్రశాంతంగా మున్సి'పోల్స్'..!
ప్రశాంతంగా మున్సి'పోల్స్'..! - పోలింగ్ కేంద్రాల్లో ఓటు వినియోగం - కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మున్నిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 36వార్డుల్లో ఉదయం నుంచి పోలింగ్ మొదలయ్యింది. ఎన్నకల సందర్భంగా పట్టణంలోని 36 వార్డుల్లో 117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెడెంట్ అభ్యర్థులతో కలిపి 135 మంది పోటీ చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపుకోసం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సహాం చూపారు. ఉదయం ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పలు వార్డుల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మొదటి సమయంలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ కొనసాగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల వరకు 10.39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది .   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41162/