schedule Saturday, September 05, 2026

బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి

calendar_today February 4, 2026
person dharshininews
బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి
బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయండి - తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - 34 వార్డు నుంచి యువకుల చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో 34వ వార్డుకు చెందిన ఇమ్రాన్ అలీ, రాయుడు, భరత్ రెడ్డి, రాము శేఖర్ పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. 34వ వార్డులో పార్టీ అభ్యర్థి సుప్రీత కరుణాకర్ కు భారీ మెజార్టీ తీసుకవచ్చే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, పటేల్ కరుణాకర్, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40986/