schedule Thursday, September 03, 2026

పట్టణ వాసులారా.. జాగ్రత్త..!

calendar_today January 12, 2026
person dharshininews
పట్టణ వాసులారా.. జాగ్రత్త..!
పట్టణ వాసులారా.. జాగ్రత్త..! - దొంగతనాలపై ప్రజలకు పోలీసుల అప్రమత్తత - ఆటోలో ప్రచారం చేస్తూ అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తాండూరు పట్టణ పోలీసులు సూచిస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణ పరిధిలో ఆటోలో మైక్ అనౌన్స్ మెంట్ నిర్వహించారు. వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. పండగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి చోరీలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే వాళ్లు ఇంట్లో ఎలాంటి ఆభరణాలు, డబ్బులు ఉంచుకోరాదని, బ్యాంకుల్లో గాని లాకర్లలో గాని దాచుకోవాలని తెలిపారు. బీరువాలకు, అల్మారాలకు, ఇంటికి సంబంధించిన తాళాలను ఇంట్లో ఉంచుకోరాదని అన్నారు. ఇంటికి వేసే తాళాలు బలమైన వాటిని ఉపయోగించాలని అన్నారు. ఇంట్లో, కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రయాణ సమాయాల్లో అపరిచిత వ్యక్తులతో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే, అనుమానాలు ఉంటే డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40516/