schedule Thursday, September 03, 2026

జాతీయ స్థాయిలో రాణించాలి

calendar_today January 10, 2026
person dharshininews
జాతీయ స్థాయిలో రాణించాలి
జాతీయ స్థాయిలో రాణించాలి - ఆర్థిక సాయం అందించిన బీఎస్ఆర్ - అక్షర విద్యార్థినికి శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో రాణించి మంచి పేరు తీసుకరావాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పట్టణంలోని అక్షర హైస్కూల్ విద్యార్థిని శ్రీలక్ష్మికి సూచించారు. అక్షర పాఠశాలకు చెందిన శ్రీలక్ష్మీ అండర్-14 విభాగంలో ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఈనెల 14న రాజస్థాన్ లో జరిగే పోటీలలో రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహిస్తోంది. శనివారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని విద్యార్థిని శ్రీలక్ష్మీ, పాఠశాల యమాజన్యం, కోచ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని శ్రీలక్ష్మీని, శిక్షణ ఇచ్చిన కోచ్ లను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటున్న శ్రీలక్ష్మీకి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. జాతీయ స్థాయి పోటీలో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో తాండూరుకు మంచి పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మోహన్ కృష్ణ గౌడ్, ప్రవీణ్, యజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40500/